Tuesday, February 19, 2008

ఇదే స్త్రీ బలహీనత

ఎంటి ఈ జీవితము ఎందుకు ఇలా అవమానాల బ్రతుకు
అసలు ఇంతకూడా అలొచన ఉండదా ఇలా మాట్లాడవొచ్చా
అని అనిపించదా? లేక నన్ను ఏడిపిస్తున్నా అన్న ఆనందము లొ
ఆ ఇంగితము పని చెయ్యట్లేదా అసలు ఈ సమాజము లొ
అందరు ఇంతేనా లేక నా ఇంట్లొనే నా ఈ పరిస్తితి
ఆడదాన్ని అవమానించాలని ఎంత ఉన్నా
మరీ ఇంత ఘోరమా ఇలా ఉంటారా ప్రతీ ఇంట్లొ
ఇలా రాసుకొవడము వలన నా బాధ ఈ సెకను ఉపసెమనము కలుగుతుందేమొ
కాని నలుగురి కి తెలిసి ఎంత అసహ్యంగా ఉంటుంది పరిస్తితి
అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తాము ఆడవాల్లము
మాకేనా పరువు మగవాల్లకి వొద్దా ?
చెత్ ఇదీ ఒక బ్రతుకేనా దేనికి ఇది సహిస్తున్నా పిల్లలు అనే బంధానికేగా
కాని కాదు సమాజము లొ పిల్లల స్తాయి కి అవమానము జరగకూడదని
ఇది ముందే తెలిసుంటే అప్పుడే వొదిలేసి ఒక నమస్కారము పెట్టేసేదాన్ని
కాని చాలా ఆలస్యమయిపోయింది ఇప్పుడు చెయ్యటము వలన పిల్లలను సమాజానికి
అవమానస్తులు గా చూపించేలా చేసినదాన్ని అవ్వనా ?
ఇదే స్త్రీ బలహీనత ఇది ఇంకెవరూ మార్చలేరు

2 comments:

Rakiii said...

hi,

thx for visiting my blog ,

sure ga next time ninchi mee sugg'ion patistunanu :)

bye

Rakiii said...

ee alochana challa strong ga unadi!

kotese la unaru!